డాక్టర్ సుధాకర్‌తో పోలీసులు ప్రవర్తించిన తీరును.. తెదేపా నేతలు తప్పుబట్టారు. అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మార్వో కార్యాలయం వద్ద.. పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈరన్న, ఇతర నేతలు నిరసన వ్యక్తం చేశారు.
ఎమ్మార్వోకు వినతిపత్రం ఇచ్చారు. దళితుడైన డాక్టర్ సుధాకర్ ను.. సీఎం జగన్ ఆదేశాలతోనే పోలీసులు దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనకు ముఖ్యమంత్రిదే బాధ్యత అన్నారు. దోషులను ప్రభుత్వం శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: