అనంతపురం జిల్లా కల్యాణదుర్గం తెదేపా నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వరం ఆధ్వర్యంలో పార్టీ నేతలు ధర్నా చేపట్టారు. ఎన్టీఆర్ భవన్ నుంచి ర్యాలీగా వెళ్లి ఆర్డీవో కార్యాలయం ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్డీవో కార్యాలయ అధికారికి వినతి పత్రం అందించారు.
రాష్ట్ర రాజధాని అమరావతి కోసం రైతులు త్యాగం చేశారని వారి కోసం తమ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అన్ని మండలాల్లోనూ తహసీల్దార్లకు అమరావతి రైతుల అక్రమ అరెస్టులకు నిరసనగా ర్యాలీలు నిర్వహించి వినతి పత్రాలు అందించారు.
ఇదీ చూడండి: