ఇసుక కొరత పై తెదేపా పోరుబాట పట్టింది. అనంతపురం జిల్లా కనేకల్లు మండలం రచ్చమరి గ్రామంలోని ఇసుక రీచ్ నుంచి మండల కేంద్రం వరకు తెదేపా అనంతపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్ కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు భారీ పాదయాత్ర చేపట్టారు. వైకాపా నాయకుల ఇసుక దోపిడీని అరికట్టాలని, సామాన్య ప్రజలకు, బేల్దారులకు, కార్మికులకు, కూలీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేస్తున్నారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని తెదేపా నాయకులు కార్యకర్తలు భారీగా వాహనాల్లో చేరుకున్నారు. తెదేపా జెండాలతో ఇసుక రీచ్ ప్రాంతమంతా కిటకిట లాడింది.
ఇవీ చదవండి