అర్హులైన చేనేతలకు నేతన్న నేస్తం పథకం అందించాలని.. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం తెదేపా ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. బ్రహ్మసముద్రం మండలంలోని పలు గ్రామాల్లో అర్హులైన వారి పేర్లు జాబితాలో లేవని ఆరోపించారు. దీనిపై ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన చేపట్టారు.
స్థానిక నాయకులతో కలిసి ఎంపీడీవోకు వినతిపత్రం అందించారు. అర్హులైన ప్రతిఒక్కరికి పథకం వర్తింపజేయాలని.. లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని ఉమామహేశ్వర నాయుడు హెచ్చరించారు.
ఇవీ చదవండి..
శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో పరిశోధక విద్యార్థిని ఆత్మహత్య