అనంతపురం జిల్లా మడకశిరలో అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించాలని మూతపడిన క్యాంటీన్ల ముందర తెదేపా నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఖాళీ ప్లేట్లతో 5 రూపాయల నాణెంతో శబ్దం చేస్తూ.... మూతపడిన అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించాలని నినాదాలు చేశారు. 15 రూపాయలకే 3 పూటల భోజన పథకాన్ని మాజీ సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం వాటిని మూసివేసి ఉపాధి కోసం పట్టణానికి వచ్చి పని చేసుకునే వారి కడుపు కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రదర్శనగా బయలుదేరి తహశీల్దారు కార్యాలయంలో అర్జీ ఇచ్చారు.
ఇది చూడండి: