ఆర్డీటీ వ్యవస్థాపకుడు విన్సెంట్ ఫెర్రర్ వర్ధంతి సందర్భంగా అనంతపురంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అవే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదురుగా విన్సెంట్ ఫెర్రర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జిల్లాకు ఆర్డీటీ సంస్థ ఒక వరంలా నిలిచిందని, పేద ప్రజలకు అండగా నిలిచిన ఈ సంస్థను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని సేవా కార్యక్రమాలు చేపట్టాలని నేతలు పిలుపునిచ్చారు.
ఇవీ చూడండి.. : పంట రుణాల కోసం వెళ్లాడు... ప్రాణాలు విడిచాడు