అనంతపురం జిల్లాలో పర్యటించడానికి ముఖ్యమంత్రి జగన్ అనర్హుడని తెలుగుదేశం నేతలు కాలవ శ్రీనివాసులు, జేసీ పవన్ రెడ్డి, ఉమామహేశ్వర నాయుడులు అన్నారు. కళ్యాణదుర్గంలో రైతు సమస్యల సాధనకు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు. రైతుల పట్ల వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణమని ఉమామహేశ్వర నాయడు ఆక్షేపించారు.
రెండేళ్ల వైకాపా పాలనలో రైతులకు చెల్లించిన బీమా, పంట నష్టం వివరాలు వెల్లడించాలని కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. రైతులను జగన్ మోసం చేస్తున్నారని అన్నారు. రాయదుర్గంలో పర్యటించటానికి జగన్ అనర్హుడని మండిపడ్డారు. రైతులకు మద్దతుగా ఆందోళనలు చేపడితే పోలీసుల ద్వారా తప్పుడు కేసులు బనాయించి కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని జేసీ పవన్ రెడ్డి ఆగ్రహించారు.
ఇదీ చదవండి:
CM Letter To PM: 'తెలంగాణ అక్రమ నీటి వాడకంపై చర్యలు తీసుకోండి'