ETV Bharat / state

సుబ్బయ్య హత్య వెనుక వైకాపా నాయకుల హస్తం: తెదేపా - సుబ్బయ్య హత్య వెనుక వైకాపా నాయకుల హస్తం ఉంది: తేదేపా

తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య వెనుక వైకాపా నాయకుల హస్తం ఉందని తేదేపా నేతలు ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఇళ్ల పట్టాల పంపిణీలో వైకాపా నాయకుల అక్రమాలపై నిలదీసినందుకే సుబ్బయ్యను వైకాపా గుండాలు దారుణంగా హత మార్చారని పేర్కొన్నారు.

tdp leaders comments on Subbiah murder
సుబ్బయ్య హత్య వెనుక వైకాపా నాయకుల హస్తం: తేదేపా
author img

By

Published : Dec 30, 2020, 4:34 PM IST

వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో హత్య రాజకీయాలను ప్రేరేపిస్తూ.. గుండాయిజం రాజ్యం ఏలుతోందని ఎమ్మెల్సీ తిప్పేస్వామి ఆరోపించారు. అధికార పార్టీ నేతలు అక్రమాలను ప్రశ్నించినందుకే సుబ్బయ్యను దారుణంగా హత్య చేశారని అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని... సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.

వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో ఎనిమిది వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతుకు రూ. 7 లక్షలు ఇస్తామని.. ఇప్పుడు మాటి మార్చారన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో అరాచక పాలనకు స్వస్తి చెప్పి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

కడపలో..

తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య వెనుక వైకాపా నాయకుల హస్తం ఉందని తెదేపా జిల్లా మహిళ నేతలు ఆరోపించారు. సుబ్బయ్య మరణంపై నిందలు వేయడం మంచిది కాదని తెదేపా నాయకురాలు శ్వేతా రెడ్డి అన్నారు. ధైర్యముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి.. కానీ ఇలా హత్య చేయడం పిరికిపందా చర్య అని పార్టీ కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కోట శ్రీదేవి వ్యాఖ్యానించారు. ఈ హత్య వెనుక వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి హస్తం ఉందని ఆరోపించారు.

ఇదీ చూడండి: ఫిర్యాదులో పేర్లను పోలీసులు మార్చేశారు: సుబ్బయ్య భార్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.