అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఇంటి ముట్టడికి వెళ్తున్న తెదేపా ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజుతో పాటు మరో పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజు అనంతపురం నుంచి ధర్మవరం వస్తుండగా... గ్రామీణ పోలీస్ స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకుని కనగానపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ధర్మవరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పోలీసు బందోబస్తు చేపట్టారు. ఎమ్మెల్యే నివాసానికి వెళ్లే మార్గాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: టీకాపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు అవగాహనా కార్యక్రమాలు: జేసీ