TDP Leaders Arrest at Anantapur: అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రంలో తెదేపా నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. పుట్టపర్తిలోని శ్మశానవాటిక స్థలంలో హెల్త్ క్లినిక్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెదేపా ఆందోళనకు పిలుపివ్వడంతో... అమరావతి నుంచి పుట్టపర్తికి వస్తున్న మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కాలవ శ్రీనివాసులును బుక్కరాయసముద్రంలో అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ ఇళ్లకు తరలించి గృహ నిర్బంధం చేశారు.
పుట్టపర్తిలో నిర్వహించే ఆందోళనకు తెదేపా నేతలు వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. శింగనమల నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు అలం నరసానాయుడు, ముంటిమడుగు కేశవరెడ్డిని సైతం అరెస్ట్ చేసి బుక్కరాయసముద్రం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడినుంచి వారిన ఇళ్ల వద్దకు తీసుకెళ్లి గృహ నిర్భంధం చేశారు.
ప్రాణాలకు తెగించి పోరాడుతాం..
శ్మశానవాటికలో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేస్తే మహిళలు, గర్భిణులు ఎలా వస్తారని పల్లె రఘునాథరెడ్డి ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రాంతంలో హెల్త్ క్లినిక్‌ను ఏర్పాటు చేయనీయబోమని స్పష్టం చేశారు. అవసరమైతే సెంటర్ ఏర్పాటుకు తాను స్థలం ఇస్తానని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతామని అన్నారు.
ఇదీ చదవండి: వైకాపా నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారు : జేసీ ప్రభాకర్ రెడ్డి