ఈ ఖరీఫ్ సీజన్లో వాతావరణం అనుకూలించక పూర్తిగా నష్టపోయిన అనంతపురం జిల్లా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని తెదేపా ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు డిమాండ్ చేశారు. కళ్యాణదుర్గం మండలంలో పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. రైతులు తమ ఆవేదనను ఆయనకు చెప్పారు. ఎంతో పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు వర్షాలతో నాశనమయ్యాయని వాపోయారు. ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ.. నష్టపోయిన అన్నదాతలందరినీ ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. వేరుశనగ రైతులకు ఎకరాకు రూ. 25వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి..
కింజరాపు వారసుడిగా ఎంట్రీ... అచ్చెన్న రాజకీయ ప్రస్థానం ఇదే..!