అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం ముష్టి కోవెలలో తెదేపా నాయకులపై దాడులు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ డిమాండ్ చేశారు. జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో చిన్నచిన్న సమస్యలు సృష్టించి వైకాపా నాయకులు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రతిచోటా వైకాపా నేతలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని.. దాడులకు పాల్పడుతున్నా.. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం సరైంది కాదన్నారు. ప్రజలకు పోలీసులు, ఆ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసే బాధ్యత పోలీసులదే అన్నారు. దాడికి పాల్పడిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దాడులను నిలువరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి: JAGAN PETITION: సీఎం జగన్ పిటిషన్పై విచారణ జులై 2కి వాయిదా