సీఎం జగన్ నిర్లక్ష్యం వల్లే.. రాష్ట్రంలోని నీటి వ్యవస్థలపై కూడా కేంద్రం పెత్తనం చెలాయిస్తోందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అనంతపురంలో విమర్శించారు. కేంద్రం గెజిట్‌తో శ్రీశైలం సహా అన్ని ప్రాజెక్టులు కృష్ణా బోర్డు పరిధిలోకి వెళ్లిపోయాయని అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లి రాష్ట్ర జల స్వరూపం వివరించినందునే అపార నష్టం జరిగిందన్నారు. ఈనెల 11న అనంతపురంలో.. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై.. సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. రాయలసీమ జిల్లాల నుంచి తెదేపా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, హాజరవుతున్నట్లు కాలవ శ్రీనివాసులు చెప్పారు. వైకాపా ప్రభుత్వ వైఖరిని ఎండగట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు.
తెలంగాణలో 23 అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా వైకాపా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఆరోపించారు. జల వివాదాల నేపథ్యంలో అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని.. అడిగే ధైర్యం సీఎం జగన్‌కు లేదని విమర్శించారు.
ఇదీ చదవండి: