ETV Bharat / state

'కొవిడ్ నిబంధనలు ప్రజలకేనా... మున్సిపల్​ అధికారులకు వర్తించవా?' - anantapur district updates

కదిరి మున్సిపాలిటి అధికారులు కరోనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెదేపా నేత కందికుంట వెంకటప్రసాద్ ఆరోపించారు. కరోనా నిబంధనలు ప్రజలు మాత్రమే పాటించాలా... మున్సిపల్ అధికారులకు వర్తించవా? అని ప్రశ్నించారు.

tdp leader kandhikunta venkataprasad
తెదేపా నేత కందికుంట వెంకటప్రసాద్
author img

By

Published : Jun 10, 2021, 9:48 PM IST

కదిరి మున్సిపాలిటి అధికారులు కొవిడ్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటం సరికాదని కదిరి నియోజకవర్గ తెదేపా ఇన్​ ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. కరోనా నిబంధనలు ప్రజలు మాత్రమే పాటించాలా? మున్సిపల్ అధికారులకు వర్తించవా? అని ప్రశ్నించారు. కర్ప్యూ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న అధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.

కరోనా కష్టకాలంలో రోడ్డు విస్తరణ పనులంటూ ప్రజలను ఇబ్బంది పెట్టడం తగదని కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. కదిరి మున్సిపల్ అధికారులు ప్రజలకు సౌకర్యాలు కల్పించడం కంటే అధికార పార్టీ నాయకుల మెప్పు కోసం పని చేస్తున్నారని విమర్శించారు.

ఇదీ చదవండి: వేధింపుల ఆరోపణలతో సూపరిండెంట్ బదిలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.