గత సాధారణ ఎన్నికల్లో.. వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని వడ్రవన్నూరు, ఆవులదట్ల, కదరాంపల్లి , వేపరాల గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులతో కలిసి స్థానిక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెదేపా కార్యకర్తలు పూలమాలలు, చప్పట్లతో ఘనస్వాగతం పలికారు.
వైకాపా ప్రభుత్వం మేనిఫెస్టోలోని అంశాలను అమలు పరచకుండా.. ప్రజలను మోసం చేసిందని శ్రీనివాసులు దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే 45 ఏళ్ల వయసువారికే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెన్షన్లు ఇస్తామని చెప్పి.. నేటికీ ఇవ్వలేదన్నారు. రైతులకు బీమా, వ్యవసాయ పరికరాలు మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. విద్యార్ధులందరికీ అమ్మ ఒడి అందిస్తామని చెప్పి, ఇంట్లో ఒకరికి మాత్రమే ఇచ్చారని అన్నారు.
ఇదీ చదవండి: