అఖిలప్రియ అరెస్ట్ వెనుక వైకాపా ప్రభుత్వం హస్తం ఉందనే అనుమానం కలుగుతోందని తెదేపా నేత జేసీ పవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ సర్కార్‌పై ఒత్తిడి తీసుకువస్తూ...కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. అఖిలప్రియ కేసులో ఏ1, ఏ2లను మార్చటమే అందుకు నిదర్శనమన్నారు. వైకాపా ప్రభుత్వం కుట్రపూరితంగా తెదేపా నాయకులను అరెస్టులు చేయిస్తోందని ఆయన అనంతపురంలో ఆరోపించారు. అందులో భాగంగానే అఖిలప్రియ అరెస్టు జరిగిందని వ్యాఖ్యానించారు.
అర్ధరాత్రి వేళ మహిళా అని చూడకుండా అఖిలను అరెస్ట్ చేయడమేంటని జేసీ పవన్ రెడ్డి ప్రశ్నించారు. ఆ కేసులో విచారణ సరిగా లేదని... తెర వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఏ1, ఏ2లను మార్చడం చూస్తే... తెలంగాణ ప్రభుత్వంపై వైకాపా సర్కార్ ఒత్తిడి తీసుకువస్తోందనే విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. జగన్ పాలనలో అన్ని వర్గాలపై కుట్రలు చేస్తూ పలు కేసుల్లో ఇరికిస్తున్నారని దుయ్యబట్టారు. వైకాపా ప్రభుత్వానికి స్వస్తి పలకాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి