ETV Bharat / state

ప్రలోభాలకు, బెదిరింపులకు తలవంచం: బీకే పార్థసారథి - ధర్మవరం మున్సిపల్ ఎన్నికలపై తెదేపా నాయకుల సమావేశం

తెదేపాకు ధర్మవరం కంచుకోటని... ఆ పార్టీ నేత బీకే పార్థసారథి పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులు తెదేపా అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

TDP leader BK Parthasarathy
"ప్రలోభాలకు, బెదిరింపులకు తలవంచము" బీకే పార్థసారథి
author img

By

Published : Feb 27, 2021, 10:25 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులతో తెదేపా నేత బీకే పార్థసారథి సమావేశం నిర్వహించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థిగా.. ప్రస్తుతం నియోజకవర్గ ఇన్​ఛార్జ్​ పరిటాల శ్రీరామ్ ఉంటారని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే, ఆయన అనుచరుల ఆగడాలను.. ప్రజలు అడ్డుకునే రోజు వస్తుందని పార్థసారథి వ్యాఖ్యానించారు. తమ అభ్యర్థులను ప్రలోభాలకు, బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎవరు భయపడే పరిస్థితిలో లేరని.. ప్రజలు ధైర్యంగా ఓటు వేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.

ఇదీ చదవండీ... 'విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తే..పెద్దఎత్తున ఉద్యమిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.