అధికారులు విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించాలని తెదేపా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ ఇంచార్జ్ కందికుంట వెంకటప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదని, అహంకారంతో వ్యవహరించిన రాజకీయ పార్టీలు కాలగర్భంలో కలిసి పోవడం ఖాయమని విమర్శించారు.
నిబంధనల అమలు విషయంలో ద్వంద్వ వైఖరిని ఆవలించటం వల్లే... మున్సిపల్ ఎన్నికల, పోలింగ్ రోజున ఆందోళన చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. ఆందోళన సమయంలో అన్న మాటాలు పోలీసులు, ప్రభుత్వ అధికారుల మనసుకు బాధ కలిగించి ఉంటాయని అన్నారు. తన మాటలను వెనక్కి తీసుకుంటున్నట్లు కందికుంట చెప్పారు.
ఇదీ చదవండీ.. 'ప్రపంచ స్థాయి ప్రమాణాలతో గుంతకల్ రైల్వేస్టేషన్ అభివృద్ధి'