ETV Bharat / state

"ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయించటం అర్థరహితం" - తెదేపా నేత కందికుంట వెంకటప్రసాద్ తాజా సమాచారం

అక్రమ కేసులు బనాయిస్తూ ప్రతిపక్షాలను బెదిరించటం అర్థరహితమని తెదేపా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ ఇన్​చార్జ్​ కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు.

tdp Kadiri constituency in-charge Kandikunta Venkataprasad
తెదేపా కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్​ కందికుంట వెంకటప్రసాద్
author img

By

Published : Apr 2, 2021, 5:09 PM IST

అక్రమ కేసులు బనాయిస్తూ ప్రతిపక్షాలను బెదిరించాలనుకోవటం అర్థరహిత ఆలోచన అని.. తెదేపా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గ ఇన్​చార్జ్​ కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. కదిరి మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ అనంతరం 29వ వార్డు ఓట్ల విషయాన్ని చర్చించటానికి వెళ్లితే.. పోలీసులపై ఒత్తిడి తెచ్చి తమపై కేసు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు ప్రజా సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు. ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులు చేయాలనుకోవటం సరికాదన్నారు. అక్రమ కేసులతో బెదిరించాలనుకోవటం కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.

ఇదీ చదవండీ.. 'ఈ పురస్కారం ఆయనకు గుర్తింపు, గౌరవం ఇచ్చింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.