అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి పాలకులు కాసుల కోసం పరితపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి విమర్శించారు. వీటన్నింటిపైనా యంత్రాంగం దృష్టి సాధించాల్సి ఉందని చెప్పారు. అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ కరోనా రోగుల స్థితిగతులను ప్రజలకు తెలపాలన్నారు. ప్రభుత్వ పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండీ…. స్పందించని 104.. దిక్కుతోచని స్థితిలో విశాఖ వాసులు