ETV Bharat / state

కరోనా మృతులకు ఆర్థిక సాయం అందించండి: తెదేపా నేతలు - corona news

కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు తగిన పరిహారం అందించాలని కోరుతూ తెదేపా నేతలు అనంతపురం జిల్లాలో నిరసనలు చేపట్టారు. ప్రభుత్వాసుపత్రులను అభివృద్ధిచేసి మెరుగైన వైద్యసేవలు అందించాలని డిమాండ్ చేశారు.

tdp leaders agitations at anantapur district kadiri
కరోనా మృతులకు ఆర్థిక సాయం అందించండి
author img

By

Published : Jun 16, 2021, 3:22 PM IST

కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెదేపా నాయకులు విమర్శించారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా అనంతపురం జిల్లా కదిరి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కరోనా బాధితులకు సరైన సదుపాయాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

కొవిడ్ తో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షలు, జర్నలిస్ట్ లను ఫంట్ లైన్ వారియర్లుగా గుర్తించి రూ.50 లక్షలు బీమా కల్పించడంతో పాటు మరణించిన వారి దహన సంస్కారాలకు రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి ప్రచారఆర్భాటంపై ఉన్న శ్రద్ధ పేదలను ఆదుకోవడంలో లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలను మెరుగుపరచి.. నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని కోరారు.

ఇవీ చదవండి:

మూడంతస్తులు ఎక్కి ఇంట్లోకి వచ్చిన ఎద్దు

108 అంబులెన్స్​లో శిశువుకు జన్మనిచ్చిన గర్భిణి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.