ETV Bharat / state

టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలంటూ ధర్నా - అనంతపురం జిల్లా వార్తలు

టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ.. తెదేపా, సీపీఐ ఆధ్వర్యంలో.. అనంతపురం, గుంటూరులో నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

dharna for tidco houses
టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలంటూ ధర్నా
author img

By

Published : Nov 12, 2020, 3:28 PM IST

టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ.. అనంతపురం జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ర్యాలీగా వెళ్లి హిందూపురం మండలం వీరంపల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్థుల గృహ సముదాయాల వద్ద బైఠాయించి ఆందోళన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. త్వరతగతిన నిర్మాణ పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించకపోతే తెదేపా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా టిడ్కో ఇళ్లకు గృహ ప్రవేశాలు చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హెచ్చరించారు.

అమరావతిలో..

రాష్ట్రంలో పేదల కోసం నిర్మించిన ఇళ్లను దీపావళి లోపు లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. లేకపోతే నవంబర్ 16న అర్హులతో గృహప్రవేశాలు చేయిస్తామని స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలో పేదల కోసం తుళ్లూరులో నిర్మించిన ఇళ్ల వద్ద సీపీఐ, తెదేపా, రాజధాని ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 29 గ్రామాల లబ్ధిదారులు ధర్నాలో పాల్గొన్నారు.

తుళ్లూరు దీక్షా శిబిరం నుంచి టిడ్కో ఇళ్ల వరకు భారీ ర్యాలీ చేశారు. గత ప్రభుత్వం పేదల కోసం నాణ్యమైన ఇళ్లను నిర్మిస్తే.... వైకాపా సర్కారు వాటిని నిర్లక్ష్యం చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. తెదేపా నిర్మించిన ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని శ్రావణ్ కుమార్ ఆరోపించారు.

ఇవీ చదవండి..

విశాఖ జిల్లాలో ఇసుక మాయం.... విలువ కోటీ 63 లక్షలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.