ఫ్యాక్షన్ కోరల్లో చిక్కుకున్న బడుగు, బలహీన వర్గాల ప్రజలకు విముక్తి కలిగించిన చరిత్ర పరిటాల కుటుంబానిదని తెదేపా బీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ చంద్రశేఖర్ యాదవ్ అన్నారు. అనంతపురంలో మాట్లాడిన ఆయన... పరిటాల రవిపై వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పరిటాల కుటుంబ చరిత్రను తెలుసుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ప్రజాప్రతినిధిగా ఉండి గల్లీ లీడర్‌కి ఎక్కువ... దిల్లీ లీడర్‌కి తక్కువగా మాధవ్ మాట్లాడారని విమర్శించారు.
దివంగత నేతలపై అనుచితంగా మాట్లాడకూడదనే కనీస సంస్కారం లేనివిధంగా ప్రవర్తించారని ఎంపీపై మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బడుగు, బలహీనవర్గాల మీద దాడులు చేస్తూ.. రక్తపుటేరులు పారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమాన్ని మరచి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారన్నారు.
ఇదీ చదవండి: 360వ రోజుకు చేరుకున్న అమరావతిలో అన్నదాతల ఉద్యమం