ETV Bharat / state

"రాష్ట్రంలో తమిళనాడు తరహా వేధింపు రాజకీయాలు" - చింతమనేని ప్రభాకర్​పై కేసులు న్యూస్

చింతమనేని ప్రభాకర్​పై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెడుతోందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. ఆయనను జైలు నుంచి బయటకు రానీయకుండా ఇప్పటివరకూ 20 కేసులు పెట్టిందని ఆరోపించారు.

payyavula keshav
author img

By

Published : Nov 5, 2019, 9:34 PM IST

మీడియాతో పయ్యావుల కేశవ్

రాష్ట్రంలో తమిళనాడు తరహా వేధింపు రాజకీయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని తెలుగుదేశం ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. అడ్డదిడ్డంగా కేసులు నమోదుచేస్తూ, చింతమనేనికి బెయిల్‌ రాకుండా కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఏలూరు సబ్ జైల్లో ప్రభాకర్‌ను కేశవ్​ పరామర్శించారు. అనంతరం దుగ్గిరాలలో ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

Intro:ap_tpg_81_5_payyavulakesav_ab_ap10162

Body:రాష్ట్రంలో తమిళనాడు తరహా వేధింపు రాజకీయాలు జరుగుతున్నాయని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను ఏలూరు సబ్ జైల్లో పరామర్శించిన ఆయన దుగ్గిరాలలోని చింతమనేని ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతమనేని పై కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయన్నారు . ఒక కేసు తర్వాత ఒక కేసులో అరెస్టులు చూపటం ఇందుకు నిదర్శనమన్నారు . కేంద్ర సర్వీసులకు నేరుగా ఎంపికైన ఎస్ పి చింతమనేని ప్రభాకర్ పై పెడుతున్న కేసుల పై సమీక్ష నిర్వహించాలని సూచించారు. ఇదే కొనసాగితే తర్వాత వచ్చే పాలనలో కూడా ఇటువంటి తరహా రాజకీయాలు జరుగుతాయని గుర్తు చేశారు . చింతమనేని ప్రభాకర్ కు రాష్ట్ర పార్టీ అండగా ఉందన్నారు . తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెట్టే కొలది వారిలో పార్టీ పట్ల అంకితభావం పెరుగుతుందని గుర్తు చేశారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.