అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పరిసరాల పరిశుభ్రత పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు శ్రీకారం చుట్టారు. మన ఇంటి ముందు మనమే శుభ్రం చేసుకుందాం అంటూ చీపురు చేతపట్టి మురుగు కాలువలను శుభ్రం చేశారు.
24వ వార్డు శాస్త్రినగర్లో మురుగు కాలువలో ఉన్న చెత్త తొలగించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎటువంటి రోగాలు దరిచేరవని చెప్పారు. తాడిపత్రిని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చి దిద్దే బాధ్యత పట్టణంలోని ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు.
ఇదీ చదవండి: