ETV Bharat / state

తప్పుచేస్తే ఎవరినీ ఉపేక్షించం: తాడిపత్రి ఘటనపై ఎస్పీ వివరణ - అనంతపురం జిల్లా న్యూస్ అప్​డేట్స్

తాడిపత్రిలో డిసెంబర్ 24 వ తేదీన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి , మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరువర్గాలకు చెందిన 10 మందిపై తాడపత్రి డీఎస్పీ చైతన్య కేసు నమోదు చేశారు. గురువారం నిందితులను తాడపత్రి పోలీసులు గుత్తి జేఎఫ్సిఎం కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి నిందితులు 10 మందికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. వీరిని కొవిడ్ పరీక్షల కోసం గుత్తి సబ్ జైల్ కు తరలించారు. అనంతరం నిందితులను గుత్తి సబ్ జైల్లోనే ఉంచారు.

Tadapatri DSP Chaitanya
Tadapatri DSP Chaitanya
author img

By

Published : Jan 1, 2021, 9:47 AM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి ఘటనలో ఇరువర్గాలకు చెందిన 10 మందిని అరెస్టు చేసినట్లు ఎస్పీ సత్యఏసుబాబు పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 24న తాడిపత్రిలో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణపై ఆరు కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసుల్లో 10 మందిని అరెస్టు చేసినట్లు చెప్పారు. మిగతా నిందితుల త్వరలో అరెస్టు చేస్తామన్నారు. తాడిపత్రి ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించారన్నారు. ఒక వర్గం తొలుత ఫిర్యాదు చేయలేదన్నారు. బాధితులు అక్కడే ఉన్నప్పుడు పోలీసులు సుమోటాగా చేయాల్సిన అవసరం లేదన్నారు.

తర్వాత న్యాయవాది ద్వారా కొంత సమాచారం పంపారు. దీంతో కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. సామాజిక మాధ్యమాల్లో ఓ ట్రబుల్‌మాంగర్‌ పెట్టిన పోస్టు వివాదానికి దారి తీసిందన్నారు. ఇలాంటి ఘటనపై భవిష్యత్తులో నిఘా పెడతామన్నారు. సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసులు బాధితులపైనే కేసులు నమోదు చేశారని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ చైతన్య, సీఐ తేజోమూర్తి పాల్గొన్నారు.

ఇదీ చదవండి: సాగర గర్భంలో చైనా డ్రోన్లు- భారత్‌ లక్ష్యంగా ఎత్తులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.