అనంతపురం నగరాన్ని శుభ్రం చేసేందుకు స్వయంగా ఎమ్మెల్యే, కలెక్టర్ రంగంలోకి దిగారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ప్రారంభించిన స్వచ్ఛ అనంత- సుందర అనంత కార్యక్రమం రెండో వారం కొనసాగింది. నగరంలోని జీసస్ నగర్లో చేపట్టిన స్వచ్ఛ అనంత కార్యక్రమంలో కలెక్టర్ గంధం చంద్రుడుతో పాటు, ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఉగాదిలోపు అనంతపురం సుందరంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని అయితే మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి సూచించారు.
నగరాన్ని శుభ్రం చేసిన కలెక్టర్, ఎమ్మెల్యేలు - అనంతపురం ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి తాజా వార్తలు
స్వచ్ఛ అనంత - సుందర అనంత కార్యక్రమంలో భాగంగా స్వయంగా ఎమ్మెల్యే, కలెక్టర్లు నగరాన్ని శుభ్రం చేశారు. ఉగాదిలోపు అనంతపురాన్ని సుందరంగా మార్చే లక్ష్యంతో 21 చోట్ల స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు.
అనంతపురం నగరాన్ని శుభ్రం చేసేందుకు స్వయంగా ఎమ్మెల్యే, కలెక్టర్ రంగంలోకి దిగారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ప్రారంభించిన స్వచ్ఛ అనంత- సుందర అనంత కార్యక్రమం రెండో వారం కొనసాగింది. నగరంలోని జీసస్ నగర్లో చేపట్టిన స్వచ్ఛ అనంత కార్యక్రమంలో కలెక్టర్ గంధం చంద్రుడుతో పాటు, ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఉగాదిలోపు అనంతపురం సుందరంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని అయితే మరింత చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతే కాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎమ్మెల్యే అనంతవెంకట్రామిరెడ్డి సూచించారు.
ఇవీ చూడండి:
సంజీవపురంలో 109 మంది దంపతులతో మహాయజ్ఞం