జనసేన మద్దతుదారుడికి ఓటు వేశారన్న కారణంతో వృద్ధుల పింఛన్లను అధికారులు నిలిపివేశారని అనంతపురం జిల్లా ధర్మవరం మండలం రేగాటిపల్లి మాజీ సర్పంచ్ ఆరోపించారు. దీనిపై ఆర్డీవో మధుసూదన్‌కు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో ఎంపీడీవో అశోక్ కుమార్ రెడ్డి 16 మంది వృద్ధులకు పింఛన్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఇందుకు నిరసనగా 16 మంది పింఛనుదారులకు రూ. 2250ల చొప్పున ఛాయాదేవి తన సొంత డబ్బును పంపిణీ చేశారు. పింఛన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడితే అధికారులపై న్యాయస్థానానికి వెళ్తామని ఆమె పేర్కొన్నారు.
పింఛన్ నిలిపివేత... సొంత డబ్బును ఇచ్చిన మాజీ సర్పంచి - వృద్ధుల ఫించన్ల నిలిపివేత న్యూస్
పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుదారుడికి ఓటు వేశారన్న నెపంతో వృద్ధుల పింఛన్లను అధికారులు నిలిపివేసిన ఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మండలంలో జరిగింది. ఈ విషయంపై రేగాటిపల్లి మాజీ సర్పంచి ఛాయాదేవి.. ఆర్డీవో మధుసూదన్‌కు ఫిర్యాదు చేశారు.