ETV Bharat / state

అనంతపురంలో విద్యార్థి సంఘాల ఆందోళన

ప్రభుత్వ కళాశాలలో రద్దు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించాలని ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

విద్యార్థుల నిరసన
author img

By

Published : Jul 6, 2019, 4:55 PM IST

అనంతపురంలో విద్యార్థి సంఘాల ఆందోళన

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రద్దు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ , ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురంలో అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులతో కలిసి ఖాళీ ప్లేట్లతో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఎంతోమంది పేద విద్యార్థుల ఆకలి తీరుస్తున్న మధ్యాహ్న పథకాన్ని రద్దు చేయడం సరికాదన్నారు. కార్పొరేట్ కళాశాలలకు వెన్నుదన్నుగా నిలవడానికే ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఇప్పటికైనా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని.. లేనిపక్షంలో ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి.

కేంద్ర బడ్జెట్​పై సీపీఐ వినూత్న నిరసన

Intro:తిరుపతికి చెందిన పవన్ కుమార్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. తిరుమల రెండో ఘాట్ రోడ్డులోని వినాయక స్వామి ఆలయానికి కిలోమీటర్ దూరంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ యువకుడు తో పాటు ఉన్న యువతి మాత్రం చిన్నపాటి గాయాలతో ప్రమాదం నుంచి బయటపడింది. దీంతో సమాచారం అందుకున్న తితిదే భద్రత సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పవన్ కుమార్ మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ రుయా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద పవన్ కుమార్ అమ్మ బోరుమని విలపించింది.Body:Tirupathi Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.