హిందూపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. డిగ్రీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థుల ప్రశ్నాపత్రాలు తారుమారు చేశారని నిరసన తెలిపారు. కళాశాలలో ఒక రూముకు మాత్రం 28 విద్యార్థులకు ప్రశ్నాపత్రం తారుమారైందని నిరసిస్తూ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం సబబు కాదన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి జరిగిన తప్పిదాలను సరిచేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కళాశాల యాజమాన్యానికి వ్యతికంగా నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన ప్రిన్సిపల్... వర్శిటీ డైరెక్టర్లతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన విరమించారు.
ఇదీ చదవండి :