ETV Bharat / state

'అధిక ధరలకు అమ్ముతున్నారు.. చర్యలు తీసుకోండి' - ఎస్ఎఫ్ఐ

నిబంధనలకు విరుద్ధంగా... అధిక ధరలకు పాఠ్యపుస్తకాలను విక్రయిస్తున్నారంటూ గుంతకల్లులోని ఓ కార్పొరేట్ కళాశాల ముందు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకలు ఆందోళన చేపట్టారు. వెంటనే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

'అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నారంటూ విద్యార్థుల ధర్నా'
author img

By

Published : Jun 23, 2019, 10:51 AM IST

Updated : Jun 23, 2019, 1:32 PM IST

'అధిక ధరలకు పుస్తకాలు విక్రయిస్తున్నారంటూ విద్యార్థుల ధర్నా'

నిబంధనలకు విరుద్దంగా పాఠ్య పుస్తకాలు విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ అనంతపురం జిల్లా గుంతకల్లులోని ఓ కార్పొరేట్ కళాశాల ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. కళాశాల తీరుపై అధికారులకు విద్యార్థి సంఘాల నాయకులు సమాచారమందించారు. గత వారంలో ఇలాంటి ఘటనలో ఓ పాఠశాలపై చర్యలు తీసుకున్నా... సదరు సంస్థ ఏ మాత్రం లెక్కచేయటం లేదని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. గుంతకల్లు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు యాజమాన్యాలతో సమావేశమై...నిబంధనలు అతిక్రమించవద్దని హెచ్చరించినా... పెడచెవిన పెడుతున్నారని ఆగ్రహించారు. తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.

Intro:మండల కేంద్రం పక్కనే గుట్టపై చిరుత భయాందోళనలో గ్రామస్తులు
_______________*
అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్ర సమీపంలో గుట్ట పై శనివారం సాయంకాలం చిరుత సేదతీరుతూ కనిపించటం మండల కేంద్రం వాసులని భయాందోళనకు గురి చేసింది ఇటీవల నియోజకవర్గంలో లో చిరుత దాడి అధికమైన నేపథ్యంలో లో తాజాగా ఈ చిరుత కనిపించటం కుందుర్పి మండలం కేంద్ర వాసులని భయం గుప్పిట్లో కి నెట్టింది ఈ సమస్యకు పరిష్కారం చూపాలని మండల కేంద్రం వాసులు కోరుతున్నారుBody:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా
Last Updated : Jun 23, 2019, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.