అనంతపురం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గుత్తి మండలం కొజ్జెపల్లి సమీపంలోని మరువ వాగు.. జాతీయ రహదారిపై పొంగి ప్రవహిస్తోంది. ఈ సమయంలో రోడ్డు దాటుతున్న లారీ వాగులో చిక్కుకుపోయింది. వాగును దాటుతున్నమరో కారు ప్రమాదానికి గురైంది. దీంతో ముందు జాగ్రత్తగా గుత్తి-బళ్లారి మార్గంలో నడిచే ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీని ప్రొక్లెయిన్ సాయంతో బయటకు తీశారు. కొంతసేపటికి వాహనాల రాకపోకలు పునరుద్ధరించారు. తాడిపత్రి మండలంలో వరద ప్రవాహంలో ఓ వృద్ధురాలు కొట్టుకుపోయింది. చుక్కలూరు-వరదాయిపల్లి మధ్య వాగు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. ఆమె కోసం స్థానికులు గాలిస్తున్నారు.
ఇవీ చదవండి: