పురాతన ఆలయం... అభివృద్ధికి దూరం..! - latest news on surya narayqan swami
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాలలో చారిత్రాత్మక పురాతన ఆలయాలు ఒకేచోట కొలువై ఉన్నాయి. సప్త అశ్వ వాహనంపై కొలువైన సూర్యభగవానుడు, వైష్ణవ-శైవ ఆలయాలు ఉన్నాయి. దేశంలో చరిత్ర కలిగిన ఎన్నో ఆలయాలు మరుగున పడినట్లే... ఈ సూర్యభగవానుడి సంస్థానం గురించి పట్టించుకునే నాథుడు లేడు. ఆలయం శిథిలావస్థకు చేరటంతో... గ్రామపెద్దలు కమిటీగా ఏర్పడి ఆలయాభివృద్ధికి కృషి చేస్తున్నారు. రథసప్తమి నాడు ఘనంగా ఉత్సవాలు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు.