ETV Bharat / state

'ఈ నెల 5న రాష్ట్ర బంద్​ను విజయవంతం చేయండి' - aisf latest news

విశాఖ ఉక్కు - పరిశ్రమ ప్రైవేటీకరణను నిరసిస్తూ మార్చి 5న రాష్ట్ర బంద్​కు పిలుపునిస్తున్నట్లు వామపక్ష పార్టీలు, ఏఐఎస్ఎఫ్ , ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం నుంచి సబ్ కమిటీలు ఏర్పాటు చేయడం.. ఆంధ్రులు ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటమేన్నారు

state bandh on the 5th of this month in ap
'ఈ నెల 5న రాష్ట్ర బంద్​ను విజయవంతం చేయండి'
author img

By

Published : Mar 2, 2021, 9:40 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీలు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ , ప్రజా సంఘాలు ఈనెల 5వ తేదీన రాష్ట్ర బంద్​కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని సీపీఎం కార్యాలయంలో మంగళవారం ఏఐఎస్ఎఫ్ , ఎస్ఎఫ్ఐ నాయకులు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం భాజపా మినహా అధికార ప్రతి పక్షాలన్నీ ముక్తకంఠంతో ఆందోళన కొనసాగిస్తున్నాయని నేతలు అన్నారు. ప్రధాని మోదీ నాలుగు రంగాలు మినహా అన్నింటిని ప్రైవేటీకరణ చేస్తామని వ్యాఖ్యానించడం బాధాకరమన్నారు. ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం నుంచి సబ్ కమిటీలు ఏర్పాటు చేయడం... ఆంధ్రులు ఆత్మాభిమానాన్ని దెబ్బతీయటమేన్నారు.

ఇదీ చదవండి

సరిహద్దు వివాదాల పరిష్కారానికి సన్నాహాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.