ST commission chairmen fire on police: అనంతపురం జిల్లాలో ఎస్సీ, ఎస్టీలను పోలీసులే కొట్టిస్తున్నట్లున్నారని... ఎస్టీ కమిషన్ ఛైర్మన్ రవిబాబు పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు ఆదేశాలు కూడా అమలు చేయకుండా... సాకులు చెబుతున్నారంటూ డీఎస్పీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ,ఎస్టీ బాధితులు స్టేషన్లకు వెళితే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. పోలీసులే వారిని కొట్టిస్తున్నట్లుగా ఉందని ఓ డీఎస్పీని నిలదీశారు.
రవిబాబు ప్రశ్నలకు సమాధానం చెప్పలేని డీఎస్పీ నీళ్లునమిలారు. మీ పద్దతి ఏమీ బాగోలేదని... ఇలాగైతే కుదరదని ఎస్పీ ఫక్కీరప్ప, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిల ఎదుట పోలీసులను హెచ్చరించారు. రెండురోజుల జిల్లా పర్యటన సందర్భంగా ఛైర్మన్ రవిబాబు కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, పథకాల అమలుపై అధికారుతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
ఇదీ చదవండి: దళిత మహిళపై సామూహిక అత్యాచారం.. పొలానికి వెళ్లివస్తుండగా..!