అనంతపురం జిల్లా హిందూపురం వైకాపాలో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వైకాపా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్‌కు వ్యతిరేకంగా పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఇక్బాల్‌ను హిందూపురం నుంచి పంపిస్తే తప్ప పార్టీకి మనుగడ ఉండదని వైకాపా నాయకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తన నివాసంలో కార్యకర్తలతో సమావేశం జరిపారు. అవినీతికి దూరంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని ఆయన అన్నారు.
ఇదీ చదవండి: