అనంతపురంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కరోనా నియంత్రణ చర్యలను ఎస్పీ సత్య ఏసుబాబు పరిశీలించారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ జాగ్రత్తలపై అప్రమత్తం కల్పిస్తూ స్టేషన్ పరిధిలో శానిటైజర్ ఏర్పాటు చేశారు. మాస్కూలను ధరించే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
అనంతపురం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ను ఎస్పీ సత్య ఏసుబాబు పరిశీలించారు. ప్రజలు కరోనాతో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. కరోనా నేపథ్యంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుదారులకు సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలో 50 ఏళ్లు పైబడిన పోలీసులను ఇంట్లోనే ఉండి పని చేసే విధంగా ఏర్పాటు చేశామన్నారు.
ఇది చదవండి అయ్యన్నపాత్రుడిపై కేసు: అరెస్టుపై స్టే ఇచ్చిన హైకోర్టు