ETV Bharat / state

నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు... 17 మంది అరెస్ట్ - illegal wine sized in anantapur

అక్రమ మద్యం నియంత్రణకు ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో విస్తృత దాడులు జరిగాయి. భారీగా మద్యంతో పాటు గుట్కా, నాటుసారా, టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

నాటు సారా తయారీ స్థావరాలపై ఎస్పీబీ అధికారుల దాడులు... 17 మంది అరెస్ట్

author img

By

Published : Nov 1, 2020, 6:28 PM IST

అనంతపురం జిల్లాలో ఎస్పీబీ అధికారుల దాడులు... 17 మంది అరెస్ట్
నాటు సారా స్థావరాలపై దాడులు... 17 మంది అరెస్ట్

జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాలు మేరకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో స్పెషల్ ఆఫీసర్ రామమోహనరావు సారథ్యంలో పోలీసు బృందాలు జిల్లాలో సోదాలు చేశారు. తండాలు, పరిసర ప్రాంతాలు, పొలాలు, అటవీ ప్రాంతాలు, గడ్డి వాములు, పశువుల పాకలు, సరిహద్దు రహదారులు, తదితర ప్రాంతాలను జల్లెడ పట్టారు. 5,595 లీటర్ల నాటు సారా ఊట ధ్వంసం చేశారు.

నాటు సారా తయారీదారులు, విక్రేతలు, మద్యం అక్రమ రవాణాదారులు మొత్తం 17 మందిని అరెస్టు చేశారు. 1,995 టెట్రా పాకెట్లు, వివిధ బ్రాండ్లకు చెందిన 10 మద్యం సీసాలు, 180.5 లీటర్ల నాటు సారా, 525 గుట్కా ప్యాకెట్లు, 41 గుట్కా పాకెట్లు, 8 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 550 లీటర్ల కల్తీ కల్లును ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

తండాల్లో ఎస్ఈబీ దాడులు.. 3వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.