మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ ఏర్పాట్లను అనంతపురం జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు పరిశీలించారు. ఉరవకొండ, గుంతకల్లు, గుత్తి మండలాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎస్పీ సందర్శించారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు.
ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రశాంత పరిస్థితులు కల్పించాలన్నారు. తమకే ఓటు వేయాలంటూ ఎవరైనా భయభ్రాంతులకు గురిచేస్తే ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద అల్లర్లు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు. గతంలో వివిధ కేసులలో ముద్దాయిలైన వారిని బైండోవర్ చేశామన్నారు. మద్యం తరలింపుపై ఎస్ఈబీ అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుంతకల్లు, తాడిపత్రి డీఎస్పీలు, డివిజన్లోని సీఐ, ఎస్సైలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: మున్సిపల్ ఎన్నికలకు తాజా ప్రకటన ఇస్తే బాగుండేది: రామకృష్ణ