అనంతపురం నగరంలో కర్ఫ్యూ ఆంక్షల అమలు తీరుని ఎస్పీ సత్య ఏసుబాబు పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని టవర్ క్లాక్ వద్ద వాహనాల తనిఖీల్లో ఆయన పాల్గొన్నారు. ఆంక్షల సమయంలో ఎవరూ బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు. రహదారులపై వెళ్తున్న వాహన చోదకులు, ఆటోలను ఆపి.. బయటకు రావటానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనవసరంగా తిరుగుతున్న వారిపై కేసులు నమోదు చేయించి.. వాహనాలను సీజ్ చేయించారు.
ఇదీ చదవండి: రాష్ట్రానికి చేరుకున్న మరో 1.32 లక్షల కొవిడ్ టీకా డోసులు