అనంతపురం జిల్లా కూడేరు మండలం కలగళ్లలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ కొడుకు కన్న తండ్రిని కొట్టి చంపాడు. అర్ధరాత్రి సమయంలో పింఛన్ డబ్బుల విషయంలో తండ్రి ఒబన్న(70), కుమారుడు జయకృష్ణకు మధ్య వివాదం చెలరేగి గొడవ జరిగింది. ఈ క్రమంలో తండ్రిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఒబన్న అక్కడికక్కడే మృతి చెందాడు.
తండ్రిపై దాడి చేసిన నిందితుడికి గ్రామస్థులు దేహశుద్ధి చేశారు. కరెంటు స్తంభానికి కట్టేసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఆస్తి విషయంలో వివాదం పెద్దదై నియంత్రణ కోల్పోయిన కుమారుడు.. ఒబన్నపై దాడి చేశాడని గ్రామస్థులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: రాయలసీమ-కోస్తా మధ్య కొత్త విద్యుత్తు లైను