అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం గుంతబావి వీధిలో 26 మందిపై పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్నకు కలిసి సమస్యను వివరించారు.
కుక్కను మీరే చంపాలని ఆయన ఉచిత సలహాలు ఇచ్చానట్లు బాధితులు తెలిపారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి కాలనీ వాసులు భయపడుతున్నారని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామని తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: సామరాయపాలెంలో అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి