యువకుల అప్రమత్తత.. విద్యార్థుల ప్రాణాలు కాపాడింది. అనంతపురం జిల్లా గుత్తి కోటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో చొరబడ్డ కొండచిలువను.. వెంటనే గమనించడం.. పెద్ద ప్రమాదాన్ని తప్పించింది. పాఠశాలలోకి వెళ్లిన కొండచిలువను వెంటనే పట్టుకున్న స్థానికులు.. అటవీ అధికారులకు అప్పగించారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి.. నీటి ప్రవాహం ద్వారా వచ్చి ఉంటుందని గుత్తికోటవాసులు భావిస్తున్నారు. పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయని, ఇదీ ఓ కారణం కావొచ్చని అభిప్రాయపడ్డారు. ఆరు రోజుల క్రితం ధర్మవరంలోని ఓ పాఠశాలలో పాము కాటుకు గురై బాలుడు మృతి చెందాడు. ఆ ఘటన మరువకముందే మరో పాఠశాలలో కొండచిలువ పట్టుకోడవంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల ఆవరణలను పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.
ఇదీ చదవండి : ఒకే రోజు.. ఏడుగురికి పాముకాటు