సింగనమల తెదేపా గ్రామకమిటీ ఎన్నికల్లో తమ వర్గానికి అన్యాయం జరిగిందంటూ... కొంతమంది నాయకులు సమావేశమయ్యారు. నియోజకవర్గంలో ఒక వర్గానికి ఇంఛార్జ్ పదవి ఇచ్చారని... గ్రామ కమిటీల్లోనూ ఒక వర్గానికే న్యాయం చేశారని మరొకరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో ఉన్న వారందరికి న్యాయం జరగాలి కానీ ఒకరికే పదవులు ఇవ్వడం సరైనదికాదని అన్నారు. అందరూ కలిసి పనిచేస్తేనే పార్టీకి గెలుస్తుందని లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని నాయకులు తెలిపారు. పార్టీలో పనిచేసే వారందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: కృష్ణాజిల్లాలో తెదేపా-వైకాపా వర్గీయుల ఘర్షణ.. పరస్పర దాడులు