అనంతపురం జిల్లా పుట్లూరు మండలం మడుగుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బయన్న స్వామి దేవాలయంలో చోరీ జరిగింది. ఆలయంలో ఎవరూ లేని సమయంలో దొంగలు లోపలికి చొరబడి 30 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని.. ఆలయాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహన్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
ఇదీ చదవండి: విస్తారంగా వర్షాలు... ఇబ్బందుల్లో లోతట్టు ప్రాంత ప్రజలు