అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలోని గుండిగానిపల్లి గ్రామంలో అరుదైన ఘటన జరిగింది. గ్రామంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం.. ప్రభుత్వం గ్రామ శివార్లలో భూమిని చదును చేసింది. అయితే ఆ ప్రదేశంలో ఓ వ్యక్తికి వెండి నాణేలు లభ్యమయ్యాయి. ఈ విషయం గ్రామస్థులకు తెలియడం వల్ల అంతా పలుగు, పార తీసుకుని అక్కడ భూమిని తవ్వటం మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న గ్రామాధికారి.. అక్కడి స్థలాన్ని పరిశీలిస్తున్నారు.
ఇదీ చదవండి: