అనంతపురం జిల్లా హిందూపురంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ గత పది రోజులుగా సమ్మెబాట పట్టిన సిల్క్ రీలర్లు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ హామీతో సమ్మె విరమించారు. బకాయి పడ్డ ఇన్సెంటివ్ను వెంటనే మంజూరు చేయాలన్నారు. సిల్క్ రీళ్లను నమ్ముకున్న కార్మికులకు ఇంటి స్థలాలు మంజూరు చేయాలన్నారు. కరెంట్ మీటర్లు కేటగిరి త్రీ నుండి ఫోర్కు మార్చాలని డిమాండ్ చేశారు. శిబిరాన్ని అధికార పార్టీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ సందర్శించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సిల్క్ రీలర్ల సంఘం అధ్యక్షుడు రియాజ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో సిల్క్ రీలర్లు సమ్మె విరమింపజేశారు.
ఇవీ చదవండి
'సిల్క్ రీలర్ల సమస్యలను పరిష్కరిస్తాం' - Anantapur District News
గత పది రోజులుగా హిందూపురంలో ఆందోళన చేస్తున్న సిల్క్ రీలర్లు సమ్మెను విరమింపజేశారు. సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ హామీ మేరకు ఆందోళనను నిలిపివేశారు.