Shop keeper misbehaviour: అనంతపురం జిల్లా కదిరిలో.. ఓ శీతల పానీయం దుకాణం ఎదుట ఉన్న తొట్టెలోని నీరు తీసుకున్న పారిశుద్ధ్య కార్మికురాలి పట్ల.. దుకాణ యజమాని దురుసుగా ప్రవర్తించాడు. చేతులు కడుక్కోవటానికి నీరు తీసుకున్నానని చెబుతున్నా వినిపించుకోకుండా.. మహిళను అసభ్య పదజాలంతో దూషిస్తూ కులం పేరుతో తిట్టాడు. అంతటితో ఆగకుండా మహిళపై చేయిచేసుకున్నాడు. దుకాణ యజమానికి సర్దిచెప్పేందుకు స్థానికులు ప్రయత్నించినా.. వారిపైన గొడవకు దిగాడు.
ఆగ్రహించిన కార్మికురాలు.. చెత్త అంతా తీసుకువచ్చి దుకాణం ముందు పారవేసింది. వీధిలోని మొత్తం చెత్తను దుకాణం ఎదుట పడేశారు. తనపై దుర్భాషలాడి.. చేయి చేసుకున్న దుకాణ యజమానిపై కేసు నమోదు చేయాలంటూ పారిశుద్ధ్య కార్మికురాలు డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసే వరకు చెత్తను తొలగించబోమని పారిశుధ్య కార్మికులు తెగేసి చెప్పారు. పోలీసులు నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన కార్మికులు వినిపించుకోలేదు.
ఇదీ చదవండి:
'అటుగా వెళ్లడానికి వీల్లేదు... ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లండి'