రైతులు బాగుంటేనే… దేశం బాగుంటుందని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం దుద్దెబండ గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో సబ్సిడీ వేరుశనగ విత్తనాలను.. మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. కరోనా కష్టకాలంలోనూ.. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆగలేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి.. ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు వ్యవసాయాధికారులు… ఆర్బీకేల ద్వారా అందుబాటులో ఉంటున్నారని వివరించారు. అన్నదాత ఆనందంగా ఉండాలని ముఖ్యమంత్రి… సబ్సిడీ విత్తనాలను అందిస్తున్నారని శంకర్ నారాయణ చెప్పారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో పెరిగిన విద్యుత్తు వినియోగం