ETV Bharat / state

ఏకగ్రీవ పంచాయతీలపై దృష్టిపెట్టాలి: ఎస్​ఈసీ

ఏకగ్రీవ పంచాయతీలపై దృష్టిపెట్టాలని ఎస్‌ఈసీ రమేశ్​కుమార్‌ అధికారులను ఆదేశించారు. రాజకీయ ఒత్తిళ్లు చేసే వారి మీద నిఘా పెట్టేందుకు షాడో టీంలను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతపురం జిల్లాలో ఎస్ఈసీ పర్యటించి.. ఎన్నికల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.

sec ramesh kumar on elections
ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌
author img

By

Published : Jan 29, 2021, 4:20 PM IST

అనంతపురం జిల్లాలో ఎస్​ఈసీ పర్యటన

ఏకగ్రీవాలపై రాజకీయ ఒత్తిళ్లు చేసేవారి మీద నిఘా పెట్టే షాడో టీంలను ఏర్పాటు చేయాలని... రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ అధికారులను ఆదేశించారు. అనంతపురం జిల్లాలో ఎస్​ఈసీ పర్యటించారు. కలెక్టర్​ కార్యాలయంలో జిల్లా, డివిజన్ స్థాయి అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

ఏకగ్రీవ పంచాయతీలపై దృష్టిపెట్టాలని.. సున్నిత ప్రాంతాలుగా పరిగణించి నిఘా ఉంచాలని ఎస్​ఈసీ సూచించారు. అన్ని ఏకగ్రీవాలను దురుద్దేశంతో చూడలేమన్నారు. ఎన్నికల నిర్వహణ పూర్తిగా రాష్ట్ర సిబ్బంది ద్వారానే జరుగుతుందని స్పష్టం చేశారు. అంతటి సమర్ధత సిబ్బందికి ఉందని.. కేంద్ర సిబ్బందిని రప్పించాల్సిన అవసరం లేదని భావిస్తున్నామన్నారు. ఎన్నికలకు ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌, ఎస్పీలు హామీ ఇచ్చినట్లు తెలిపారు. స్థానిక అధికారుల ప్రణాళికకు కొన్ని సూచనలు చేసినట్లు ఎస్​ఈసీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి సజ్జలను తప్పించాలని గవర్నర్​కు ఎస్‌ఈసీ లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.